admin

Geo Thermal powerplant in Manuguru by Singareni

geothermal singareni

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జియో థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ వైపు భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు, సౌర విద్యుత్తు కేంద్రాల నిర్మాణం జరుగుతున్న తరుణంలో జియో థర్మల్‌ కేంద్రం ఏర్పాటుకు కొన్నేళ్లుగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సర్వే చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పగిడేరు పంచాయతీ గొల్ల కొత్తూరు గ్రామంలో ప్రయోగాత్మకంగా 20 కిలోవాట్ల జియో …

Read More »

Heavy Water Plant,Aswapuram was shut down

Heavy Water Plant Manuguru

మే నెలలో ఎండలు తీవ్రం కావడం, ప్రవాహం లేకపోవడం.. తదితర కారణాలతో కుమ్మరిగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా తగ్గింది. ఇన్‌టేక్‌వెల్‌లో ప్రస్తుతం కనీస పరిమాణంలో కూడా జలాలు లభ్యం కావడం లేదు. Heavy Water Plant భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థ, ఆసియాలో పెద్దదైన మణుగూరు భారజల కర్మాగారం(హెవీవాటర్‌ ప్లాంట్‌)ను ఈనెల 11 సాయంత్రం నుంచి షట్‌ డౌన్‌ చేశారు. నీరు అందుబాటులో …

Read More »

Kothagudem Election update 2018

kothagudem assembly

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఖమ్మం నుంచి విడిపోయి సింగరేణి గనుల ఖిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఏర్పడింది. భద్రాచలం రాములవారు నెలకొన్న  గిరిజన జిల్లాలో ఐదునియోజకర్గాలు కలవు. వీటిలో నాలుగు స్థానాలు ఎస్టీ రిజర్వు కావడం విశేషం. గిరిజనుల ప్రభావం ఎక్కువగల కొత్తగూడెంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో జిల్లా నుంచి ఒక్క అభ్యర్థి మాత్రమే టీఆర్‌ఎస్‌ తరుపున గెలుపొందారు. ఈ జిల్లాలో ఉన్న మొత్తం …

Read More »

Singareni Dependent Jobs update

singareni jobs

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు ముందు కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో యాజమాన్యం నిబంధన విధించింది. రెండేళ్ల సర్వీసు లేని కార్మికులు ఎందరో అనారోగ్యం బారిన పడుతున్నారు. వీరికి నిబంధన ప్రకారం కారుణ్య నియామకం వర్తించదు. ఈ విధానంపై కార్మికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సర్వీసు చివరిరోజున కూడా కార్మికులు …

Read More »

New Mine in Singareni-Kondapuram

kondapuram

కొండాపురం కంటిన్యూయస్‌ మైనర్‌ గని సింగరేణికే తలమాణికంగా నిలవనుంది. సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రారంభించిన నూతన గనులలో ఇది ఒకటి. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు కంటిన్యూయస్‌ మైనర్ల యంత్రాలతో బొగ్గును వెలికతీయనుండటం ఈ గని ప్రత్యేకత. 2019-20 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని సాగుతున్న పనులు ఆరు నెలల్లో పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, రెండు కంటిన్యూయస్‌ మైనర్లతో సింగరేణికి ఆదర్శ గనిగా …

Read More »

Outstanding award for Singareni

సింగరేణి సంస్థ శక్తి సామర్థ్యాలకు, పురోభివృద్ధికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.. ప్రముఖ ఎంజీఎంఐ (మైనింగ్ జియోలాజికల్ అండ్ మెట్లర్జికల్ ఇన్‌స్టిట్యూట్) సింగరేణి సాధిస్తున్న అత్యుత్తమ ఉత్పత్తి, ఉత్పాదకతలను పరిగణనలోనికి తీసుకొని జాతీయ స్థాయిలో భారీ బొగ్గు ఉత్పత్తి సంస్థల విభాగంలో ఎక్స్‌లెనర్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రకటించింది. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఏడో కోల్ సమిట్ – 2018 సదస్సు ముగింపు వేడుకల్లో ఈ అవార్డును …

Read More »

Election update Bhadradri Kothagudem

Kothagudem Elections

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే తెరాస అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. గులాబీ రేసుగుర్రాలు కార్యక్షేత్రంలోకి దిగి తమ విజయావకాశాలు మెరుగుపరచుకొనే పనిలో నిమగ్నమయ్యారు. తెరాస అభ్యర్థి బలాలు ఏమిటీ? బలహీనతలు ఏమిటీ? ఎవరిని ప్రత్యర్థిగా నిలిపితే పోటీలో విజయం సాధిస్తామన్న సమాలోచనలో ప్రతిపక్ష పార్టీలున్నాయి. సిట్టింగు స్థానాలతోపాటు ప్రతిపక్ష స్థానాలను కైవసం చేసుకోవాలన్న భావనతో తెరాస రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. తెరాస …

Read More »

Singareni Dependent Jobs Update

dependent jobs

సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలు జరిపితీరుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిలబెట్టుకున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలను సరైన రీతిలో కల్పిస్తామని చెప్పిన ఆయన తొలినుంచి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. ఇటీవల సింగరేణి ఏరియాల్లో పర్యటించి కారుణ్య నియామకాలపై త్వరలోనే నిర్ణయం చెప్తామని సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కార్మికుల ఏండ్ల తరబడి నిరీక్షణకు తెర దించుతూ సింగరేణి సంస్థ శనివారం సర్క్యులర్ జారీచేసింది. …

Read More »

Steel Plant in Kothagudem

Steel Plant in kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆత్యాధునికమైన తుక్కు ఆధారిత ఉక్కు పరిశ్రమను (ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్-ఈఏఎఫ్) ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు. శుక్రవారం రాజధానిలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఐటీ, గనులశాఖల మంత్రి కే తారక రామారావు, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మెల్యే జలగం వెంకట్రావులతో కలిసి కేంద్రమంత్రి మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎన్‌ఎండీసీ …

Read More »

CMPF SCAM IN KOTHAGUDEM

kothagudem singareni

సింగరేణి కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో గత మూడు నెలల నుంచి ఉద్యోగ విరమణ కార్మికులకు భవిష్య నిధి అందడం లేదు. ఒక నెలలో ఉద్యోగ విరమణ చేసే కార్మికుడికి అదే నెలలో లెక్కను పూర్తిచేసి సీఎంపీఎఫ్‌(భవిష్య నిధి) చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ఆనవాయితీగా వస్తోంది. కానీ జులై నెలాఖరు నుంచి అక్టోబరు వరకు ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు ఇప్పటివరకు భవిష్య నిధి లెక్కలు …

Read More »