New Mine in Singareni-Kondapuram

కొండాపురం కంటిన్యూయస్‌ మైనర్‌ గని సింగరేణికే తలమాణికంగా నిలవనుంది. సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రారంభించిన నూతన గనులలో ఇది ఒకటి. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు కంటిన్యూయస్‌ మైనర్ల యంత్రాలతో బొగ్గును వెలికతీయనుండటం ఈ గని ప్రత్యేకత. 2019-20 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని సాగుతున్న పనులు ఆరు నెలల్లో పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, రెండు కంటిన్యూయస్‌ మైనర్లతో సింగరేణికి ఆదర్శ గనిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌, సింగరేణి సీఎండీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో ఉన్నతాధికారులు పనుల పురోగతిపై ఏరియా అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తొలి అడుగు పడిందిలా..
కొండాపురం కంటిన్యూయస్‌ మైనర్‌ గని నిర్మాణానికి తొలి అడుగు పడింది. రెండు కంటిన్యూయస్‌ మైనర్లతో బొగ్గును ఉత్పత్తి చేసేందుకు సంచయతి మైనింగ్‌ సర్వీసెస్‌(ఎస్‌ఎంఎస్‌) అనే కంపెనీతో పదేళ్ల కాలపరిమితితో యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీ గనిలో పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. జీ-5 నాణ్యత గల బొగ్గును ఏడాదికి 7 లక్షల టన్నుల మేరకు వెలికితీస్తే సింగరేణి కంపెనీ ఎస్‌ఎంఎస్‌కు టన్నుకు రూ.1,348 ధర చెల్లించనుంది. ఈ ఏడాది జులైలో ఎస్‌ఎంఎస్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు రామచంద్రరావు, జీఎం జనార్దనరావు ఆధ్వర్యంలో కంపెనీ బృందం గనిని పరిశీలించి వెళ్లారు.  పనుల అప్పగింతపై సింగరేణి బోర్డు క్లియరెన్స్‌ రావడంతో పనులు ప్రారంభించేందుకు యంత్రాలు తీసుకురానున్నారు. షాప్ట్‌ పనులను సూర్యచంద్ర కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పనులు చేపట్టనుంది. కంటిన్యూయస్‌ మైనర్లతో తీసిన బొగ్గును టన్ను రూ.4,000 వేల చొప్పున సింగరేణి విక్రయించనుంది. ఈ విధానంతో సింగరేణి వ్యాప్తంగా ఏడాదికి రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు లాభాలు పెరిగే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా బొగ్గును వెలికితీసేందుకు 60 మీటర్ల వెడల్పుతో రెండు ట‌న్నెల్‌(సొరంగాలు)ల ఏర్పాటు పనులను త్వరలో ప్రారంభించేందుకు సింగరేణి ప్రయత్నిస్తోంది.

నష్టాల నుంచి లాభాల్లోకి..
ప్రస్తుతం కొనసాగుతున్న కొండాపురం భూగర్భ గని (పంచ్‌ ఎంట్రీ) నష్టాల్లో కొనసాగుతోంది. రోజుకు 300 టన్నులు, ఏడాదికి 62 వేల టన్నులు మాత్రమే బొగ్గు ఉత్పత్తి అవుతుంది. అత్యంత తక్కువ బొగ్గు ఉత్పత్తి అవుతుండటంతో సింగరేణికి పెద్దగా లాభాలు లేవు. ఈ గని వల్ల సింగరేణికి ఏడాదికి రూ.30 కోట్ల నష్టం వస్తుంది. గనిలో లోడ్‌ హాల్ట్‌ డంపర్‌ (ఎల్‌హెచ్‌డీ) యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి జరుగుతుండటంతో అనుకున్న లక్ష్యానికి బొగ్గు ఉత్పత్తి జరగడం లేదు. కొత్త గని కంటిన్యూయస్‌ మైనర్‌ గని ప్రారంభం కాగానే రోజుకు 300 టన్నుల నుంచి 3 వేల టన్నులకు ఉత్పత్తి పెరగనుంది. రెండు ట‌న్నెళ్లలో సింగరేణి, ఎస్‌ఎంఎస్‌ కంపెనీలు ఏకకాలంలో రెండు వైపులా బొగ్గును వెలికితీయడం ద్వారా సింగరేణిలోనే బొగ్గు ఉత్పత్తిలో మణుగూరు ఏరియా ప్రథమ స్థానంలో నిలిచే అవకాశం లేకపోలేదు. ఏరియాలో ఓసీ 2, ఓసీ 4, మణుగూరు ఓసీ గనులలో ప్రస్తుతం జీ 13, జీ 7, జీ 9 నాణ్యత గల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. కొత్త గని కొండాపురం కంటిన్యూయస్‌ మైనర్‌నిలో అత్యంత నాణ్యమైన జీ 5 బొగ్గు నిక్షేపాలు ఉండటం, దీనికి డిమాండ్‌ ఎక్కువగా ఉండటం ఈ ఏరియాకు బాగా కలిసొచ్చే అంశం. ధర ఎక్కువగా ఉండటం, ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి కానుండటంతో ఏరియా నుంచి లాభాలతో అగ్రగణ్యంగా నిలిచే అవకాశం ఉంది.

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *