Chillies for health

ప‌చ్చి మిర్చి లేదంటే ఎండు మిర్చితో చేసిన కారం… ఏదైనా మ‌న‌కు కారంగానే ఉంటుంది. అయితే కారం అస్స‌లు ఉండ‌ని మిర‌పకాయ జాతులు కూడా ఉన్నాయ‌నుకోండి, అది వేరే విష‌యం. ఈ క్రమంలో మిర‌ప‌కాయను ఎలా వండినా దాంతో వంట‌ల‌కు రుచి మాత్ర‌మే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో లాభాలు కూడా క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!

1. మిర‌ప‌కాయ‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ ఆక్సిడెంట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్షన్ల నుంచి ర‌క్ష‌ణ‌ను క‌ల్పిస్తుంది. అంతేకాదు శ‌రీరం ఆహారం నుంచి ఐర‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హించుకునేలా చేస్తుంది. దీంతో ర‌క్త‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

2. క్యాప్సైసిన్ అనే ఓ ర‌సాయనం మిర‌ప‌లో ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల అది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది. అంతేకాదు, వివిధ ర‌కాల శ‌రీర నొప్పులు కూడా త‌గ్గుతాయి.

3. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌ను త‌గ్గించే గుణాలు మిర‌ప‌లో ఉన్నాయి. శ‌రీరంలో పెరిగే క్యాన్స‌ర్ క‌ణతుల పెరుగుద‌లను మిర‌ప‌లోని ఔష‌ధ గుణాలు అడ్డుకుంటాయి.

4. స్థూల‌కాయం ఉన్న వారు బ‌రువు త‌గ్గేందుకు మిర‌ప‌ను తినాలి. దీంతో అధికంగా ఉన్న బ‌రువు త‌గ్గిపోతారు. అంతేకాదు, మ‌ధుమేహం ఉన్న వారికి మిరప ఎంత‌గానో మేలు చేస్తుంది. ఎలా అంటే… ఇది పాంక్రియాస్‌ను ఉత్తేజ ప‌రిచి ఇన్సులిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీంతో ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.

5. ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.

6. శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. పేగుల్లో ఉండే హానిక‌ర‌మైన బాక్టీరియా నాశ‌న‌మ‌వుతుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది.

7. ఒక టీ స్పూన్ చ‌క్కెర‌ను, ఒకటి రెండు బాదం గింజలను, ఒక పండు మిరపకాయను కలిపి దంచాలి. దీనిని చిన్నచిన్న ఉండలుగా తయారుచేసి తీసుకుంటే గాయకులకు, ఉపన్యాసకులకు, టీచర్లకు, లెక్చరర్లకి గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది.

8. వంద‌ గ్రాముల బెల్లంలో ఒక గ్రాము ఎర్ర మిరప పొడిని కలిపి చిన్నచిన్న మాత్రలుగా తయారుచేసి నీళ్లతో తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది. అర గ్రాము ఎండు మిరప పొడిని 2 గ్రాముల శొంఠి చూర్ణంతో కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపునొప్పి తగ్గుతాయి.

9. మిరపగింజలను 125 గ్రాముల మోతాదుతో తీసుకుని వాటిని అర కిలో నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద గింజలు మాడిపోయే వరకూ వేడి చేయాలి. తరువాత వడపోసి సీసాలో నిల్వ చేసుకోండి. మిరప గింజల తైలం సిద్ధమవుతుంది. శరీరంలో వేడి పెరిగిపోవటం, పైత్యం పెరగటం వంటి సమస్యల వల్ల ఆహార పదార్థాల రుచి తెలియకపోతుంటే, ఆకలి తగ్గితే, ఈ మిరప గింజల తైలాన్ని 5 నుంచి 30 చుక్కలు ఒక టీస్పూన్ పంచదారతో కలిపి తీసుకోవాలి. దీంతో ఆకలి పెరుగుతుంది.

10. మిరప గింజలను చెరిగి శుభ్రం చేసి, మెత్తగా పొడిచేసి గుడ్డతో వ‌స్త్ర‌ఘాళితం చేయాలి. దీనిని ఒక చిటికెడు తీసుకొని చిటికెడు కర్పూరం, చిటికెడు పొంగించిన ఇంగువ పొడిని కలిపి, తగినంత తేనె కలిపి తీసుకోవాలి. లేదా వీటి మిశ్రమాన్ని 125 మిల్లీగ్రాముల మాత్రలుగా చేసి నిల్వ చేసుకొని ప్రతి రెండు గంటలకూ ఒక్కోటి చొప్పున నీళ్లతో వేసుకుంటే కలరా వ్యాధిలో నాడి తగ్గిన సందర్భాల్లో నాడి వేగం పెరుగుతుంది.

11. నల్ల మందు, పొంగించిన ఇంగువ వీటిని సమంగా కలిపి 125 మి.గ్రా. మాత్రలుగా చేయాలి. దీనిని మిరప కషాయంతో తీసుకుంటే కలరా వ్యాధి తగ్గుతుంది. 125 గ్రాముల మిరపకాయలను అర కిలో నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద గింజలు మాడిపోయే వరకూ వేడి చేయాలి. తరువాత దించి వడపోసి నిల్వ చేసుకోవాలి. మిరప తైలం సిద్ధమ‌వుతుంది. కలరాలో విరేచనాలు, వాంతుల తరువాత ఈ తైలాన్ని పూటకు అర టీస్పూన్ మోతాదుగా రెండు మూడు పూటలు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎండు మిరపకాయల పొడిని తేనెతో కలిపి రేగు గింజలంత మాత్రలుగా తయారుచేసి పెట్టుకోవాలి. కలరా వ్యాధిగ్రస్థునికి గంటకో మాత్ర చొప్పున చన్నీళ్లతో ఇస్తే ప్రమాదం నుంచి బయటపడతాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *