Olive Oil Benifits

ఇత‌ర నూనెల‌తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ ధ‌ర చాలా ఎక్కువ‌నే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే అది అందించే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఆలివ్ ఆయిల్‌లో ఉన్నాయి. శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ దీంట్లో ఉంటాయి. ఆలివ్ ఆయిల్‌ను వాడ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను కూడా మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఆలివ్ ఆయిల్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్‌ నూనెది ప్రత్యేక స్థానం. చిన్నారులకు మర్ధనా చేయడానికి ఎక్కువగా ఈనూనెను ఉపయోగిస్తారు. చర్మానికి వాడే మందులు, ఆయింట్‌మెంట్స్‌ తయారీలోనూ దీనిని ఎక్కువగా వాడుతారు. ఈ నూనెతో చర్మాన్ని మసాజ్‌ చేసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా, కాంతిగానూ మారుతుంది.

2. చలికాలంలో డ్రై చర్మం కలవారు ఆలివ్‌ ఆయిల్‌ను చర్మానికి ప్రతిరోజూ రాస్తుంటే, చర్మం పగలకుండా ఉంటుంది. చర్మంపై పుండ్లు గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలను పోగొట్టి చర్మం సహజ రంగుతో నిగారింపుగా ఉండేలా చేస్తుంది.

3. చిన్న పిల్లలకు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి శరీరానికి మసాజ్‌ చేస్తే వారి చర్మం మృదువుగా ఉండి అందంగా తయారవుతారు. పీలగా ఉన్న పాపాయిలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే బొద్దుగా అందంగా అవుతారు. గ్రీస్‌కు చెందిన మహిళలయితే ఆలివ్‌నూనెను మించిన పరిష్కారం లేదంటూ సూచిస్తారు. రోజూ స్నానానికి ముందు కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుంటే చాలు చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. దాంతోపాటు స్నానపు నీటిలో నాలుగైదు చుక్కల ఆలివ్‌నూనెనూ వేసుకుంటారు వీరు. కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుని ఆ తర్వాత చ‌క్కెర‌తో రుద్దుకుంటే ముడతలు దరిచేరవు.

4. ఆలివ్ నూనెలో EXTRA VIRGIN, VIRGIN, PURE, EXTRA LIGHT అని నాలుగు ర‌కాలు ఉంటాయి. అందులో మొదటిది ఎక్స్ ట్రా వర్జిన్‌ ఆలివ్ ఆయిల్ మంచిది . నాలుగు చెంచాల ఓట్‌మీల్ పొడిలో మూడు చెంచాల ఆలివ్‌నూనె కలిపి పాదాలకు మర్థన చేసి అరగంటయ్యాక చల్లటినీళ్లతో కడిగేస్తే మృతకణాలి తొలగిపోయి పాదాలు మృదువుగా తయారవుతాయి.

5. ఆకుకూరలు ఉడికించే నీళ్లలో కొద్దిగా ఆలివ్‌నూనె వేస్తే పోషక విలువలు పోకుండా తగ్గకుండా ఉంటాయి.

6. జుట్టు పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, ఆలివ్‌నూనె, ఆముదాలను సమపాళ్ళలో తీసుకుని బాగా కలపాలి. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు బాగా పట్టించి తరువాత తలస్నానం చేయాలి. బరకగా (ROUGH) మారిన మోచేతులకు కొద్దిగా ఆలివ్‌నూనె రాసి మర్దనా చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మార్పు ఉంటుంది.

7. ఒక టీస్పూన్ గ్లిజరిన్‌, కొద్దిగా రోజ్‌వాటర్‌, రెండు టీస్పూన్ల‌ ఆలివ్‌నూనె, కాస్త నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి చేతులకు పూతలా వేసుకోవచ్చు. ఆరాక కడిగేసుకుంటే చాలు చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.

8. నాలుగు చుక్కల అల్లం రసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. కుదుళ్లు దృఢమవుతాయి.

9. ఆలివ్ నూనె వృద్ధుల్లో స్ట్రోక్ రిస్క్‌ను సగానికి సగం తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం, అలాగే స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ ఉపయోగించిన వృద్ధుల్లో 41 శాతం స్ట్రోక్ తగ్గిందని పరిశోధనలో తేలింది.

10. ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.

11. చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్‌ ఆయిల్‌లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్‌చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.

12. ఆలివ్‌ఆయిల్‌ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి. ఆలివ్‌ఆయిల్‌లో టమాటోరసం, క్యారెట్‌జ్యూస్‌, పెరుగుకలిపి మచ్చల మీద రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి.

13. స్నానం చేయబోయే ముందు పిల్లలకు ఆలివ్‌ఆయిల్‌ను ఒంటికి పట్టించి, మృదువుగా మర్దనా చేసి, మెత్తని సెనగపిండితో రుద్ది స్నానం చేయిస్తే పిల్లల లేతచర్మం ఎంతోకాంతిగా వుంటుంది. ఎముకలు దృఢపడతాయి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

14. చలికాలంలో ఆలివ్‌ఆయిల్‌ను పెదాలకు రాస్తూంటే పెదాలు పగలకుండా మృదువుగా వుంటాయి. ఆలివ్‌ఆయిల్‌లో తాజా గులాబీపూల రసాన్ని కలిపి పెదాలకు రాస్తుంటే, పెదాలు పగలవు, మంచిరంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

15. ఆలివ్‌ఆయిల్‌ను వెచ్చచేసి, వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి, పది పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేసినట్లయితే, జుట్టు రాలిపోకుండా వుంటుంది.

16. ఈ ఆయిల్‌లో వెల్లుల్లిపొట్టును కాల్చిన పొడిని కలిపి కానీ లేదా వెల్లుల్లి పొట్టును అలాగే ఆయిల్‌లో కలిపి కాచి కానీ తలకు రాసుకుంటే జుట్టు నల్లబడటమే కాకుండా, త్వరగా జుట్టు నెరవదు.

17. పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తూంటే ముఖ చర్మం తేమగా ఉంటుంది. కాంతిగానూ, మృదువుగానూ మారుతుంది.

18. ఆలివ్‌ఆయిల్‌లో పసుపుపొడిని కలిపి పాదాల పగుళ్ళకు, వేళ్ళమధ్య పాసిన చర్మానికి రాస్తూంటే ఆ బాధ తగ్గిపోయి, చర్మం చక్కగా ఉంటుంది. ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి పెదాలకు రాయడం వల్ల పెదాలు పగలవు.

19. ఆలివ్‌ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకు రాసుకుని, తలస్నానం చేసినట్లయితే వెంట్రుకలు మెత్తగా మారుతాయి. కేశాలు పొడవుగా పెరుగుతాయి.

20. మలబద్ధకంతో బాధపడుతున్న పిల్లలకు ఆలివ్‌ఆయిల్‌తో చేసిన ఆహార పదార్థాలను తినిపిస్తే నయం అవుతుంది. లేదంటే ఆలివ్‌ఆయిల్‌ను వెచ్చచేసి పిల్లల బొడ్డు చుట్టూ మర్దనా చేసినట్ట‌యితే మలబద్ధకం తగ్గుతుంది.

Tags:uses of olive oil,benifits of olive oil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *