665 Jobs in Singareni

న్యూస్‌టుడే: సింగరేణిలో 665 మంది గిరిజన ఉద్యోగులను నియమించుకొనేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సింగరేణిలో రిజర్వేషన్ల అమలులో భాగంగా 665 ఉద్యోగాలను గిరిజనులకు ఇవ్వాల్సి ఉంది. దీని కోసం 2013 సంవత్సరంలో నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ దాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. తిరిగి 665 బదిలీ వర్కర్ల ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నియామకాలు మైనింగ్‌ చట్టం ప్రకారం కేవలం పురుషులకు మాత్రమే కేటాయించనున్నారు. పదో తరగతి గానీ దానికి సమానమైన విద్యార్హత కలిగిన 45 ఏళ్ల వయస్సు లోపు వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 01.01.2017 నాటికి 18 సంవత్సరాలు నిండి, 45 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. రోజుకు రూ.604.33 వేతనంగా చెల్లించే ఈ ఉద్యోగ నియామకం కోసం తెలుగులో రాతపరీక్షను నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తారు. సెప్టెంబరు 2 లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రతిని ధ్రువీకరణ పత్రాలతో జత చేసి సెప్టెంబరు 12 లోగా జీఎం పర్సనల్‌, ఆర్‌సీ, ఐఆర్‌పీఎం, ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌, రిక్రూటüమెంటüసెల్‌, కొత్తగూడెం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు సింగరేణి అధికారిక వెబ్‌సైట ssclmines.com లో కెరియర్స్‌ అనే శీర్షికలో చూడవచ్చునని తెలిపారు.

Tags : badili workers,singareni jobs,kothagudem jobs.st jobs,

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *