Army Recruitment Rally in Kothagudem

ఆగస్టు 18 నుంచి 24 వరకు కొత్తగూడెం జిల్లాలో జరగనున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో థేనీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఈ నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారని.. నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 29న ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రచురితమైనట్లు ఆయన వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి వివరాలను తెలుసుకోవచ్చునని ఆయన సూచించారు. నియామకానికి హాజరయ్యే అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన జీపీఏ మార్కులు తెలియజేస్తూ బోర్డు ద్వారా జారీ చేసిన పత్రాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. అనంతరం నిర్వహించే కామన్ పరీక్షలకు కూడా మార్కుల జాబితాను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని, రిక్రూట్‌మెంట్ డైరెక్టర్ ద్వారా నిర్దేశించబడిన విధంగా రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అభ్యర్థుల అర్హతను వారు పొందిన మార్కుల శాతాన్ని పరిశీలించడం జరుగుతుందని అన్నారు. అర్హులైన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

Tags:kothagudem army recruitment,army recruitment,rally,kothagudem jobs

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *