All Set for Sri Rama Navami Celebrations

భద్రాచలం రామక్షేత్రం కల్యాణశోభను సంతరించుకుంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలో బుధవారం శ్రీసీతారాముల కల్యాణం, గురువారం శ్రీరామపట్టాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలను నిర్వహించేందుకు మిథిలా ప్రాంగణం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. సీతారాముల కల్యాణ వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు.

భద్రాద్రికి ప్రత్యేక బస్సులు
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి అదనపు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఇవాళ 150 బస్సులు, 5న 330, 6న 100 ప్రత్యేక బస్సులు భద్రాద్రికి వెళ్లనున్నాయి. ఇక భద్రాచలం నుంచి పర్ణశాలకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు బయల్దేరనుంది. దూరప్రాంత బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు.

పార్కింగ్, ఉచిత వసతి ఏర్పాట్లు
కల్యాణ మండపం పక్కన, మార్కెట్ యార్డు ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. విస్తా కాంప్లెక్స్, గోదావరిఘాట్ వద్ద భక్తులకు ఉచిత వసతి ఏర్పాట్లు కల్పించారు. పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో డ్రమ్ముల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారు. భక్తులకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని వైద్యశాఖ అందించనుంది. భక్తుల సౌకర్యార్థం 11 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసింది వైద్యశాఖ.

4 ప్రాంతాల్లో ప్రసాదాల కౌంటర్లు
భద్రాచలం పట్ఠణంలోని 4 ప్రాంతాల్లో ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం కోర్టు ఆవరణ, స్టీమర్ రోడ్డు, ఆంజనేయ స్వామి ఆలయం వెనుక, పడమర మెట్ల వద్ద ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారు.

పోలీసుల బందోబస్తు
సీతారాముల కల్యాణోత్సవం నేపథ్యంలో భద్రాద్రిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులకు సెక్టార్ల వారీగా విధులు అప్పగించారు. ప్రతి సెక్టార్ కు ఇద్దరు చొప్పున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీవీఐపీల రాకపోకలు, దేవస్థానం, క్యూలైన్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

అందుబాటులో అగ్నిమాపక శాఖ
50 మంది అగ్నిమాపక సిబ్బంది, 5 ఫైరింజన్లు అందుబాటులో ఉండనున్నాయి. సింగరేణి రెస్క్యూ టీమ్ ను అగ్నిమాపక శాఖ అందుబాటులో ఉంచింది. పోలీసు స్టేషన్ నెం. 08743-232433, అగ్నిమాపక కేంద్రం నెం. 08743-232301.

Tags:Bhadrachalam,sri rama navami,cm kcr,tsrtc

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *