Bhadrachalam Temple Design

భద్రాద్రి రామాలయం అభివృద్ధిలో భాగంగా వైదిక పెద్దల సూచనలతో ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి నమూనా సిద్ధం చేశారు. ఇది భక్తుల మదిని దోచే రీతిలో ఉంది. ఇంకా తుది దశకు చేరుకుంటే అద్భుతం సాక్షాత్కారం అవుతుంది. నిధులకు వెనుకాడకుండా పనులు ఆలస్యం కాకుండా నిర్మాణాలు చేపడితే భద్రాచలం దివ్యక్షేత్రం భూలోక వైకుంఠమై భక్తులకు దర్శనమివ్వడం ఖాయం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవడంతో యాదాద్రి, వేములవాడ తరహాలో భద్రాద్రి ఆధ్యాత్మిక అభివృద్ధి బాటలో పయనించేలా ఈ ప్రణాళిక కనిపిస్తుందని వైదిక పెద్దల భావన.

మంత్రముగ్ధులను చేస్తున్న ప్రణాళిక
ఈ ప్రణాళిక అమలైతే చిత్రకూట మండపం ఉండటం కష్టమే. దీన్ని తొలగించే వీలుంది. ఇప్పుడున్న ప్రాకారంతోపాటు మరో ప్రాకారం నిర్మించాల్సి ఉన్నందున విశాలంగా ఉండాలంటే చిత్రకూటాన్ని తొలగిస్తారని అనుకుంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మాడవీధులు ఇప్పుడున్న దానికన్నా ఇంకా విశాలం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో అడ్డుగా ఉన్న కట్టడాలను కూల్చడం అనివార్యం అవుతుంది. కల్యాణ మండపం కళా సంపదతో కళకళలాడుతున్నందున దాని జోలికి వెళ్లకపోవచ్చు. ఈ మండపంలోని ప్రాంగణాన్ని పెంచే వీలుంది. ఇదే జరిగితే సూపర్‌బజార్‌ వరకు ఆలయ అభివృద్ధి ఉంటుంది. స్టేడియం కింది భాగానికి ఆనుకుని అన్నదానం నిర్వహిస్తున్నారు. దీన్ని ఇంకా విశాలంగా నిర్మించే వీలుంటుంది. ఆలయం మొదటి ప్రాకారంలోనే లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయం, రెండో ప్రాకారంలో ఆంజనేయస్వామి వారి కోవెల ఉంటాయి. ఆలయం నుంచి గోదావరికి వెళ్లే మార్గంలో రామకోటి స్తూపం భారీ ఎత్తులో ఉంటుందని భావిస్తున్నారు. నరసింహస్వామి ఆలయం చుట్టూ ఉన్న వాటిలో కొన్ని నిర్మాణాలను తొలగించే వీలుంది. దీనికి అందంగా మెట్లను ఏర్పాటు చేస్తారు. రామాలయానికి చెందిన విస్తా కాంప్లెక్స్‌ను ఉంచుతారా? లేక తీసేస్తారా అన్నది ఆగస్టులో తయారయ్యే డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లో స్పష్టత వస్తుంది. ఆలయం నుంచి విస్తా కాంప్లెక్ల్‌ వైపుగా కరకట్టకు ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారు. ఇవి రద్దీ సమయంలో ఉపయోగపడతాయి. రాకపోకలకు అనుకూలంగా వీటిని మెట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడి నుంచి బయల్దేరినా రహదారులు అందుబాటులోకి వస్తాయి. అందమైన పచ్చని వనాలను ఖాళీ ప్రదేశంలో పెంచనున్నారు. స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు. అన్ని విధాలుగా సుమారు 100 నిర్మాణాలను తొలగించాల్సి వస్తుందని అనుకుంటున్నారు. ఈ సంఖ్య ఇదే స్థాయిలో ఉంటుందా? లేక పెరుగుతుందా అన్నది త్వరలో మరోసారి నిపుణుల బృందం పరిశీలించాక తేలనుంది. ఆర్కిటెక్ట్‌ అందించిన ప్రణాళికను క్షేత్రస్థాయికి తీసుకొచ్చి మరోసారి డ్రోన్‌ కెమెరాలలో చిత్రించి ఒక నిర్ణయానికి వచ్చే వీలుంది. ఆలయంలోకి వెళ్లేందుకు క్రమ పద్ధతిలో క్యూలైన్లు ఉంటాయి. ఇక్కడ స్థలం వృథా కాకుండా చూస్తారు. వీఐపీలు ఏ మార్గంలో వస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడున్న లిఫ్ట్‌ను ఉంచుతారా? తొలగిస్తారా? అన్నది కూడా ఉన్నత స్థాయిలో నిర్ణయించాల్సి ఉంది. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక పరమైన బొమ్మలు ఇతర వస్తువులు విక్రయించేందుకు వీలుగా నిర్మాణాలు ఉంటాయని తెలిసింది. రంగనాయకులగుట్ట యథాతథంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ గుట్ట నుంచి రామాలయం వరకు మార్గం ఏర్పాటు చేస్తే హరినాథ్‌బాబా ఆలయం వరకు కొంత స్థల సేకరణ చేయాల్సి వస్తుందని అనుకుంటున్నారు. జీయర్‌ మఠం వైపు రహదారి విస్తరణ ఉంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఈ అభివృద్ధిలో ఇళ్లు, స్థలాలు కోల్పోయే వారితో చర్చించాల్సి ఉంటుంది. వారు అంగీకరిస్తే పనుల్లో వేగం వస్తుంది. భద్రాద్రిని టెంపుల్‌ సిటీ చేస్తే ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత మరింత వెల్లివిరిస్తుంది. ఇందుకు కూడా సమగ్రంగా చర్చించాల్సి ఉంటుంది.

bhadrachalam temple design
bhadrachalam temple design

Tags: bhadrachalam temple,new design,yadadri, bhadradri

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *