Greeen signal for Kothagudem to sathupalli railway line

సింగరేణి బొగ్గు రవాణా అవసరాల కోసం కొత్తగూడెం-సత్తుపల్లి బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు పూర్తి అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు మార్చి 28న ఓ లేఖ అందింది.  కొత్తగూడెం-సత్తుపల్లి మధ్య 53.20 కి.మీల బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గ నిర్మాణానికి  రూ.704.31 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే బోర్డు సమర్పించిన సవివర పథక నివేదిక(డీపీఆర్‌)ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు ఈ లేఖలో తెలిపారు.

రైల్వే మార్గం నిర్మాణ వ్యయాన్ని సింగరేణి బొగ్గు గనుల సంస్థ, భూసేకరణ వ్యయాన్ని దక్షిణ మధ్య రైల్వే భరించాల్సి ఉంటుందని రైల్వే బోర్డు పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై సింగరేణి సంస్థ దాదాపు రూ.620 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశముందని సంస్థ యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే లైన్ల నిర్మాణానికి అనుమతి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైల్వే శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే లైను నిర్మాణం పూర్తయితే సత్తుపల్లి గనుల నుంచి బొగ్గు రవాణా సురక్షితంగా, పర్యావరణ హితంగా జరిపే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. రైల్వే శాఖకు సంబంధి భూసేకరణ, నిర్మాణ కార్యక్రమాలు త్వరగా చేపట్టాలని రైల్వే శాఖకు కోరారు.

రోడ్డు మార్గంలో: సింగరేణి సంస్థ కొత్తగూడెంకు 55 కి.మీల దూరంలోని సత్తుపల్లి బొగ్గు గనులు నిర్వహిస్తోంది. సత్తుపల్లిలోని జేవీఆర్‌ ఓపెన్‌కాస్ట్‌ గనుల నుంచి రోజూ 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. భవిష్యత్తులో ఏడాదికి 100 లక్షల టన్నుల బొగ్గు ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బొగ్గును పాల్వంచలోని కేటీపీఎస్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి సరఫరా చేస్తుండగా, భవిష్యత్తులో ప్రతిపాదిత మణుగూరు, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సైతం ఇక్కడి నుంచే సరఫరా చేయనున్నారు.

లారీల ద్వారా రోడ్డు మార్గంలో పెద్ద ఎత్తున బొగ్గు సరఫరా చేస్తే పర్యావరణ, రక్షణ సమస్యలతో పాటు ఇతర సమస్యలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే మార్గంలో బొగ్గు రవాణా జరపాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.  నిర్మాణ వ్యయాన్ని సింగరేణి భరిస్తే రైల్వే నిర్మించేందుకు రైల్వే శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. రూ.704.31 కోట్ల అంచనా వ్యయంతో ఈ రైల్వే నిర్మాణానికి అనుమతి లభించగా, అందులో సివిల్‌ ఇంజనీరింగ్‌ పనులకు రూ.586.44 కోట్లు, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పనులకు రూ.34.47 కోట్లు, ఎస్‌ అండ్‌టీ ఇంజనీరింగ్‌ పనులకు రూ.29.99 కోట్లు, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌(టీఆర్‌డీ) పనులు రూ.53.341 కోట్లు వ్యయం చేయనున్నారు.

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *