New Stadium in Kothagudem

కొత్తగూడెం మున్సిపాలిటీలో నూతనంగా మరో స్టేడియాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఇప్పటివరకు కొత్తగూడెం పట్టణంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు పోస్టాఫీస్ సెంటర్‌లోని ప్రకాశం స్టేడియం ఒక్కటే అందుబాటులో ఉన్నది. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, క్రీడాకారుల సౌకర్యార్ధం మరో స్టేడియం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. దీంతో అంత స్థలం ఎక్కడ ఉందనే దానిపై ఆరా తీశారు అధికారులు. కానీ ప్రజల కోసం ఒక అడుగుముందే ఆలోచించే ఎమ్మెల్యేజలగం వెంకటరావు రామాటాకీస్ ఏరియాలోని రాజీవ్‌పార్కు సమీపాన ఉన్న స్థలాన్ని గుర్తించారు. పిచ్చిమొక్కలు, గతంలో ఒక డంపింగ్‌యార్డు ప్రాంతంగా ఉన్న దీనిని గత పాలకులు ఎవరూ కనీసం పట్టించుకోలేదు కదా కన్నెత్తి చూడలేదు.

ఎమ్మెల్యే జలగం వెంటకరావు ప్రత్యేక చొరవతో…
ఎమ్మెల్యే జలగం వెంకటరావు మాత్రం ఈ స్థలంపై ప్రత్యేక చొరవ తీసుకొని తొలిసారిగా ఇందులో గతేడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆ తర్వాత మరోసారి యధావిధిగా పిచ్చిమొక్కలు పెరగడం ఈ స్థలం ఎందుకు పనికిరాకుండా పోయింది. కానీ ఈ ఏడాది కూడా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించడంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సైతం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. వారంరోజుల పాటు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ విభాగాలన్నింటిని ఇందులో భాగస్వామ్యం చేసి ఈ ప్రదేశానికి ఒక రూపు తీసుకువచ్చారు. దీంతో ఇంత పెద్ద స్థలం పట్టణ పరిధిలో ఉందనే విషయంపై అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అధికారులు సైతం ఇక్కడ ప్రజలందరికి ఉపయోగపడే నిర్మాణం చేపడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీంతో అప్పటికప్పుడే దీనిని మున్సిపల్ గ్రౌండ్స్ అనే నామకరణం సైతం చేశారు.

నూతన స్టేడియంకు ప్రతిపాదనలు..?
సుమారు ఆరేడు ఎకరాలు ఉన్న ఈ స్థలం పట్టణానికి నడిబొడ్డున ఉంది. రామాటాకీస్ ఏరియాలో స్టేడియం ఏర్పాటు చేస్తే క్రీడాకారులతో పాటు చుట్టుపక్కల ఏరియాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రామాటాకీస్ చుట్టుపక్కల ఉన్న హనుమాన్‌బస్తీ, బూడిదగడ్డ, హాస్పిటల్ ఏరియా, గాజుల రాజంబస్తీ, కూలీలైన్, ఏ పవర్‌హౌస్ బస్తీ, ప్యూన్‌బస్తీ, సన్యాసిబస్తీ, బర్లిఫిట్, మధురబస్తీ ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందనే ప్రజలు చెబుతున్నారు. స్టేడియం ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తే క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకొని ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసినవారవుతారు. అంతేకాకుండా ఎంతో వెనుకబడి ఉన్న రామాటాకీస్‌తో పాటు చుట్టుపక్కల ఏరియాలకు సైతం మహర్ధశ పడుతుందని స్థానికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *