Papikondalu Visit

కొండల మధ్య దక్షిణ గంగానమ్మ ప్రవాహం అతి సమీపం నుంచి చూస్తు నదిలో విహరిస్తుంటే ఆ అనుభూతి వేరు. పాపికొండలతో పాటు మార్గమధ్యలో మరికొన్ని సుందర ప్రాంతాలను సైతం సందర్శించవచ్చు

పాపికొండల ప్యాకేజీ ఇలా
ఖమ్మం నుంచి భద్రాచలం 120 కి.మీ దూరం. ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. రూ.110 నుంచి రూ.150 వరకు బస్సులను బట్టి ఛార్జీలు వర్తిస్తాయి. ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నుంచి భద్రాచలం 40 కి.మీ దూరం. ఆర్టీసీ ఛార్జీ రూ.36 నుంచి రూ.55 వరకు ఉంది. భద్రాచలం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం పోచారం 65 కి.మీ దూరం ఉంది. భద్రాచలం నుంచి అక్కడి వరకు ప్రతీ రోజు ఆర్టీసీ బస్సు నడుపుతుంది. భద్రాచలం నుంచి పాపికొండల వరకు ప్యాకేజీని కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. ఇక్కడి నుంచి టాటా ఏసీలు ద్వారా లాంచీలు ఉండే పోచారం వరకు ప్రయాణ సౌకర్యం కలిగిస్తారు. ఇందుకు పెద్దలకు రూ.650 పిల్లలకు రూ.450 ఛార్జీ వసూలు చేస్తారు. అక్కడి నుంచి లాంచీలో వెళ్లి తిరిగి వచ్చే వరకు ఈ ఛార్జి వర్తిస్తుంది. లాంచీలో ఉదయం అల్పాహారం అందిస్తారు. మధ్యాహ్నం భోజనం అందిస్తారు. సాయంత్రం బిస్కట్లు, టీ అందిస్తారు. సాయంత్రం 5 వరకు తిరిగి పోచారం చేరుకుంటారు. పాపికొండలు మార్గమధ్యలో హటü్సలో నైట్‌ హాల్ట్‌ చేసేవారు రూ.1800 చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ఆ రోజు రాత్రి నాన్‌ వెజ్‌ భోజనం అందిస్తారు. తెల్లారిన తర్వాత ఉదయం అల్పాహారం అందిస్తారు. మధ్యాహ్నం భోజనం అందిస్తారు. ఇలా కాకుండా నేరుగా సొంత వాహనాలతో పోచారం వరకు వెళ్లిన వారు పాపికొండల యాత్రకు పెద్దలు రూ.450 చెల్లించాలి. పిల్లలు రూ.300 చెల్లించాలి. ఏసీ లాంచీలకు అదనంగా ఛార్జీ తీసుకుంటారు.

10 గంటలకు ముందే చేరుకోవాలి
పాపికొండలకు వెళ్లే పర్యాటకులు భద్రాచలంలో బస చేస్తుంటారు. ఇక్కడ దేవాలయం తరుఫున 200 వరకు గదులు ఉండగా ప్రైవేటువి 300 వరకు ఉంటాయి. ఉదయం రామాలయం దర్శనం అయ్యాక 8 గంటలకు ముందే ఇక్కడి నుంచి ప్రయాణమవ్వాలి. పోచారం వెళ్లడానికి గంటన్నర సమయం పడుతుంది. సమయం అయిపోతుందన్న ఒత్తిడి లేకుండా ఉండాలంటే 9 గంటలకు పోచారం చేరుకుంటే మంచిది. పోచారానికి పాపికొండలకు మధ్యలో సుమారు 30 కి.మీ దూరం ఉంటుందన్నది ఓ అంచనా. మార్గమధ్యలో పేరంటాలపల్లి మునివాటం ప్రశాంతతకు నిలయంగా ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపు గడిపితే మానసిక ప్రశాంతంగా ఉంటుంది. కొల్లూరు వద్ద భోజనాలు చేస్తారు. వెదురుతో తయారైన గుడిసెలు ప్రకృతికి అద్దం పట్టేలా ఉంటాయి. రెండు కొండల మధ్య ప్రవహించే గోదావరి సోయగాలను తనివితీరా ఆస్వాదించాలంటే పాపికొండల యాత్ర అత్యంత అద్భుతంగా ఉంటుంది. మధ్య దళారీలను నమ్మకుండా అధికారిక ఒప్పందాలు ఉన్నవారితో సంప్రదించాలని ప్యాకేజీ అందిస్తున్న పూనెం కృష్ణ తెలిపారు.

Tags:papikondalu,bhadrahalam to paikondalu,kothagudem to papikondalu

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *